స్మార్ట్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ చిట్కాలతో మీ ఆర్థిక వ్యవహారాలను మెరుగుపరుచుకోండి

Author Team Jar
Date Apr 21, 2023
Read Time Calculating...
స్మార్ట్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ చిట్కాలతో మీ ఆర్థిక వ్యవహారాలను మెరుగుపరుచుకోండి

 కానీ మీరు ఇంటర్నెట్‌లో వెతికి, చాలా ఫైనాన్స్ పుస్తకాలు, బ్లాగులను చదివితే, మీకు చాలా వ్యక్తిగత ఆర్థిక సలహాలు తెలుస్తాయి.

 

ఇది చాలా పెద్ద, భయంకరమైన, కష్టమైన అంశంగా కనిపించవచ్చు. కానీ మమ్మల్ని నమ్మండి, అలా ఏమీ కాదు. మీరు ఆర్థిక స్వేచ్ఛను సాధించడంలో ఆర్థిక అక్షరాస్యత సహాయపడే ఈ 4 మార్గాలను చదవండి.

 

దురదృష్టవశాత్తు, చాలా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు పర్సనల్​ ఫైనాన్స్ గురించి అధ్యయనం చేయడం లేదు.

 

మన దేశంలో చాలా మంది యువకులకు ప్రాథమిక ఆర్థిక విద్య లేకపోవడం వల్ల తమ డబ్బును ఎలా మేనేజ్​ చేయాలో, రుణాలు ఎలా పొందాలో లేదా అప్పుల నుండి ఎలా బయటపడాలో తెలియడం లేదు.

 

కాబట్టి గుర్తుంచుకోండి - ఇది అంత సులభమేమీ కాదు. మీరు ఇప్పటికే ఈ కొత్త అలవాట్లను అలవాటు చేసుకోకపోయి ఉంటే, వాటిని అలవాటు చేసుకోవడానికి, వాటి ద్వారా లబ్ధి పొందడానికి సమయం పడుతుంది.

 

మంచి విషయం ఏమిటో మీకు తెలుసా? ప్రస్తుత కాలంలో, మీ పెట్టుబడులకు బడ్జెటింగ్​ నుంచి ఆటోమేటింగ్​ వరకు మీకు అన్నింటికీ యాప్‌లు ఉన్నాయి.

 

ప్రతిదీ మీ సమయాన్ని ఆదా చేయడానికి సరళీకృతం, సులభతరం చేయబడింది.

 

అయితే, మీరు మీ డబ్బుపై ఎక్కువ నియంత్రణను కలిగి ఉండాలనుకుంటే, మెరుగైన ఆర్థిక జీవితాన్ని ఆస్వాదించాలని అనుకుంటే మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని తెలివైన మనీ మేనేజ్‌మెంట్, ఆర్థిక విద్య చిట్కాలు ఉన్నాయి.

1. మీరు సంపాదించే దానికంటే తక్కువ ఖర్చు పెట్టండి

 

మీరు ఎంత సంపాదిస్తున్నా కానీ సంపాదన కన్నా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తే మీకు ఇబ్బందిగా ఉంటుంది.

 

స్వయం–నియంత్రణను నేర్చుకోండి. ఇప్పటికే మీ దగ్గర ఉన్న దానిని ఎలా పొదుపు చేయాలో తెలుసుకోండి. సమయానికి తగ్గట్టుగా చేసే ఖర్చు వల్ల మీ డబ్బు ఆదా అవుతుంది.

 

2. బడ్జెట్‌ ఏర్పాటు చేసుకోండి

 

మీ డబ్బు ఎక్కడ ఖర్చు చేయబడుతుందో బడ్జెట్ మీకు చూపుతుంది. మీరు చెల్లించే సమయాన్ని బట్టి మీరు వారానికి, పదిహేను రోజులకు లేదా నెలవారీ బడ్జెట్‌ను ఎంచుకోవచ్చు.

 

మీరు ఒక సంవత్సరంలో ఎంత డబ్బు సంపాదించినా కూడా బడ్జెట్ అనేది చాలా అవసరం.

 

3. 50/30/20 రూల్​ను గైడ్​లైన్ లా పాటించండి

 

మీకు బడ్జెట్, పొదుపు చేయడంలో సమస్య ఉన్నట్లయితే 50/30/20 రూల్​ను అమలు చేయడం గురించి ఆలోచించండి. మీ సంపాదనను ఈ క్రింది విధంగా కేటాయించడమే దీని లక్ష్యం:

 

కిరాణా, హౌసింగ్, యుటిలిటీస్, ఆరోగ్య బీమాతో సహా తప్పనిసరి అవసరాలపై 50%.

 

బయట తినడం, షాపింగ్ చేయడం, హాబీల వంటి కోరికలపై 30%.

మీ ఆదాయంలో 20%ని అత్యవసర నిధి, కాలేజ్ ఫండ్ లేదా రిటైర్మెంట్ ప్లాన్ వంటి పొదుపుల వైపునకు మళ్లించాలి.

 

4. అప్పును నివారించండి, క్రెడిట్ గురించి స్వతహాగా తెలుసుకోండి

 

మీకు ఏవైనా అప్పులు ఉంటే, వీలైనంత త్వరగా వాటన్నింటినీ చెల్లించండి.

 

అప్పు తీసుకోవడం కొన్ని సందర్భాల్లో బాగానే ఉంటుంది. ఇల్లు, కారు కొనుగోలు చేయడంలో లేదా సరిగ్గా ఉపయోగించినప్పుడు మీ వైద్య ఖర్చులను నిర్వహించడంలో ఇది మీకు సహాయం చేస్తుంది.

 

కానీ క్రెడిట్‌ను నిర్లక్ష్యంగా ఉపయోగించినప్పుడు, అది మీరు కోరుకునే భవిష్యత్తును దోచుకునే అప్పుల కుప్పకు దారి తీస్తుంది. కాబట్టి దీని విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదు.

 

మీరు ఏమి చేసినా, క్రెడిట్ ఎలా పని చేస్తుందనే దానిపై మీకు పూర్తి అవగాహన ఉండేలా చూసుకోండి.

 

5. పొదుపు వ్యూహాన్ని సిద్ధం చేసుకోండి

 

మీ పొదుపును పెంచుకోవాలనుకుంటే మీ జీతంలో కనీసం 5-10% శాతాన్ని దానికోసం కేటాయించండి.

 

6. పెట్టుబడి పెట్టండి

 

సూపర్, పొదుపు ఖాతాకు కంట్రిబ్యూట్ చేసిన తర్వాత మీ వద్ద డబ్బు మిగిలి ఉంటే, మీరు దానిని వేరే దానిలో పెట్టుబడి పెట్టాలని అనుకోవచ్చు.

 

పెట్టుబడి విషయంలో సమయం చాలా కీలకం.

 

చక్ర వడ్డీ మీ ఆర్థిక పరిస్థితిని కాలక్రమేణా పూర్తిగా మార్చవచ్చు. కాబట్టి ఈరోజే పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. ఆ తర్వాత ప్రయోజనాలను పొందండి.

 

కాబట్టి, ఇప్పుడు మీ డబ్బును మీ కోసం పని చేయించే సమయం ఆసన్నమైంది.

 

7. మీరు దేనిలో పెట్టుబడి పెడుతున్నారో తెలుసుకోండి

 

మీకు తెలియని పెట్టుబడుల్లో పెట్టుబడి పెట్టకండి. ఈరోజు చాలా పెట్టుబడి ఆప్షన్లు ఉన్నాయి. కానీ మీకు ఏది ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుందో అర్థం చేసుకోండి.

 

మీకు ఏ పెట్టుబడి ఆప్షన్లు ఉత్తమమో నిర్ణయించడంలో ఆర్థిక సలహాదారుడు మీకు సహాయం చేయగలరు.

 

ఫైనాన్స్, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ గురించి వీలైనంత చదివి అవగాహన పెంచుకోండి.

 

8. మీ ఇన్సూరెన్స్ పాలసీని పరిశీలించండి

 

మరణం, ప్రమాదం లేదా వ్యాధి సంభవించినప్పుడు మీ కుటుంబాన్ని, ఆదాయాన్ని కాపాడుకోవడానికి తగిన ఇన్సూరెన్స్ ను కలిగి ఉండటం చాలా కీలకం.

 

9. మంచి రికార్డులను నిర్వహించండి

మీరు మంచి ఫైనాన్షియల్ రికార్డ్‌లను కలిగి ఉండకపోతే బహుశా మీ అర్హత ఉన్న ఆదాయపు పన్ను మినహాయింపులు, క్రెడిట్‌లన్నింటినీ క్లెయిమ్ చేయలేకపోవచ్చు.

 

ఒక పద్ధతిని సృష్టించి ఏడాదంతా దానికి కట్టుబడి ఉండండి. మీ పన్నులను ఫైల్ చేసే సమయం ఆసన్నమైనప్పుడు ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది.

 

10. ఆర్థిక సహాయాన్ని కోరండి

 

సమయం లేకనో లేదంటే ఆర్థిక వ్యవహారాలను సరిగ్గా నిర్వహించాలనే కోరిక లేని వ్యక్తులలో మీరు ఒకరా?

 

చాలా మంది వ్యక్తులు పని, కుటుంబంతో నిమగ్నమై ఉన్నందున పెట్టుబడి అవకాశాలను కొనసాగించడం, నష్టాలను అర్థం చేసుకోవడం కష్టంగా భావిస్తారు.

 

మీరు అలాంటి వారైతే, ఒక ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి. అతను/ఆమె మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయం చేయగలరు.

 

11. క్రమబద్ధంగా ఉండటానికి వివిధ యాప్‌లను ఉపయోగించండి, మీ బడ్జెట్‌ను రూపొందించండి, పెట్టుబడి పెట్టండి

 

మేము ఇంతకు ముందు చెప్పినట్లుగా, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ కోసం చాలా విషయాల్లో మీకు సహాయపడటానికి, సలహా ఇవ్వడానికి ప్రస్తుతం మార్కెట్లో రకరకాల యాప్​లు ఉన్నాయి.

 

సమయాన్ని ఆదా చేయడానికి, తెలివిగా పెట్టుబడి పెట్టడానికి, పొదుపును సులభతరం చేయడానికి మీరు ఖచ్చితంగా వాటిని ఉపయోగించాలి.

 

మీ డబ్బు విషయాలను నిర్వహించే తాళం చెవి మీ దగ్గరే ఉంది. ఈ రోజే జార్ యాప్​తో మీ పెట్టుబడి ప్రయాణాన్ని, పొదుపు చేయడాన్ని ఎందుకు ప్రారంభించకూడదు?

 

 

 

 

Team Jar

Author

Team Jar

ChangeJar is a platform that helps you buy gold.

download-nudge

Buy Digital Gold

Join 4 Cr+ Indians on Jar, India's Most Trusted Gold Buying App.

Download App Now

emperor666

emperor666